అన్నను స్కూల్‌ బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలుడు మృతి

అన్నను స్కూల్‌ బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలుడు మృతి

ముద్ర ప్రతినిధి, వరంగల్ : అన్నను స్కూల్ కు పంపించేందుకు తల్లితో వెళ్లిన మూడేళ్ల బాలుడిని మృత్యువు కబలించింది. ఈ విషాద ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దండవేన శరత్-మమత దంపతుల పెద్ద కుమారుడు సాన్విక్ గట్ల నర్సింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. రోజు స్కూల్ బస్ లో పాఠశాలకు వెళ్తుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బస్ ఎక్కించేందుకు చిన్న కుమారుడు శివాన్ష్ (3) కూడా తల్లితో కలిసి బస్ దగ్గరకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో శివాన్స్ ఒక్కసారిగా బస్ వద్దకు పరుగెత్తుకెళ్లాడు. డ్రైవర్ గమనించకుండా బస్సును కదిలించడంతో టైర్ల కింద పడిన శివాన్స్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.