విద్యా శాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలి..

విద్యా శాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలి..
  • సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు మంగ పాండరి దొమ్మాట భాస్కర్..
  • సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత..

ముద్ర ప్రతినిధి భువనగిరి :విద్యాశాఖలో గత 15-20 సంవత్సరాలుగా విద్యా శాఖలో పనిచేస్తూ అతి తక్కువ వేతనాలు తీసుకుంటున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్స్ స్కేల్ అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంగ పాండరి దొమ్మాట భాస్కర్ డిమాండ్ చేశారు.సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్స్ కి అమలు చేయాలని మంగళవారం కృష్ణ జిల్లా కలెక్టర్ ఆ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు టైం స్కేల్ సాధించేవరకు నిరంతరంగా ఉద్యమాలు నిర్వహిస్తామని అందులో భాగంగానే 29 30 తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రేలే దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి శ్రవణ్ రవిప్రసాద్ విజయ్ కుమార్ స్వామి యాకయ్య లింగస్వామి తిరుపతి కృష్ణ బాలయ్య నందకిషోర్ పరుశరాములు స్వామి తదితరులు పాల్గొన్నారు.