శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా..?

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా..?

రామకృష్ణాపూర్,ముద్ర: ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు బిజెపి పార్టీకి లేదా..? అని మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్ రామకృష్ణాపూర్ పోలీసులను ప్రశ్నించారు. మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని అంగడి బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద అర్హులైన దళితులందరికీ పది లక్షల రూపాయల దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,మూడెకరాల భూమి అందించాలని బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా నిరసన దీక్ష చేపెట్టెందుకు ఏర్పాటు చేసిన టెంట్ కు పర్మిషన్ లేదంటూ పట్టణ ఎస్సై అశోక్ అడ్డుకున్నారు. అక్కడే ఉన్న బీజెపి నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికే అందుతున్నాయని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బందు అర్హులైన నిజమైన లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోబీజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి మాస్ సత్యనారాయణ, సీనియర్ నాయకుడు ఠాకూర్ దన్ సింగ్,జిల్లా నాయకుడు శ్రీనివాస్,పట్టణ ఉపాధ్యక్షుడు జంగపెల్లి మల్లయ్య,వైద్య శ్రీనివాస్,కార్యదర్శి వెంకటేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు సంతోష్ రామ్, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు పాల రాజయ్య,నాయకులు హరీష్,క్రాంతి కుమార్,అజయ్,నర్సయ్య,శేకర్ తదితరులు పాల్గొన్నారు.