భూపాల్ నాయక్ కు యువత మద్దతు

భూపాల్ నాయక్ కు యువత మద్దతు

డోర్నకల్: యువ నేత భూపాల్ నాయక్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తామంతా కష్టపడి ఆయనను గెలిపించుకుంటామంటూ డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది యువకులు ముందుకు వస్తున్నారు. తట్టుపల్లి తండా వద్ద గల భూపాల్ నాయక్ ఫామ్ హౌస్ లో మంగళవారం నాడు సమావేశమైన యువకులు ఆయన విజయం కోసం ఎంతైనా కష్టపడతామని అన్నారు. అనంతరం భూపాల్ నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో యువతకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రధానంగా యువతకు వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి దిగానని చెప్పారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డివై గిరి, భీమా నాయక్, విష్ణు నాయక్, బాలు, అశోక్, మంగిలాల్, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.