నారాయణ గారు నమస్కారం..

నారాయణ గారు నమస్కారం..

మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి సత్యవతి రాథోడ్, సిపిఐ జాతీయనాయకులు నారాయణ మాట ముచ్చట 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్, సిపిఐ జాతీయనాయకులు నారాయణ ఎదురుపడ్డారు. సిపిఐ బహిరంగసభలో పాల్గొనేందుకు మహబూబాబాద్ వచ్చిన నారాయణ ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ చేయడం కోసం ఉదయాన్నే వచ్చారు.  అదేసమయంలో ఎన్టీఆర్ స్టేడియంలో సౌకర్యాలను పరిశీలించేందుకు రాష్ట్ర గిరిజన స్త్రీ-శిశుసంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్టేడియంకు చేరుకున్నారు  ఇద్దరు పరస్పరం ఎదురుపడడంతో ఒకరినొకరు పలకరించుకున్నారు. నమస్కారం నారాయణ గారు అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ మాట కలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. మహబూబాబాద్  మారిపోయిందని, ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.  జిల్లా కేంద్రం స్థాయికి  తగినట్లుగా ఎన్టీఆర్ స్టేడియంను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. మీరు మానుకోట స్టేడియానికి రావడం చాలా ఆనందంగా ఉందని, మీ సూచనలను కచ్చితంగా పాటిస్తామని సత్యవతి రాథోడ్ నారాయణతో అన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్ వెంట మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి కాళోజీ వాకర్స్ సభ్యులు ఉన్నారు