ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కరువు..

ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కరువు..

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలకు కనీస వసతులు కరువు అయ్యాయని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్.పి.ఆర్.డి)జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా ప్రభుత్వాన్ని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నల్లెల్ల గ్రామంలో పనులు జరిగుతున్న ప్రాంతంలో పరిశీలించారు. అనంతరం ఖాజా మాట్లాడుతూ..  కురవి మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి ఉందని, ఉపాధి కూలీలకు టెంటు,మెడికల్ కిట్టు, మంచినీరు లాంటి సౌకర్యాలు కల్పించాలని చట్టంలో ఉన్నాయని, అధికారులు ఎక్కడ అమలు చేయడం లేదని వారు విమర్శించారు.

పనులు జరిగిన 14 రోజుల్లో డబ్బులు చెల్లించాలి కానీ నెలలు గడిచిన డబ్బులు రాకపోవడంతో కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి ఉపాధి పనిదినాలు 100 నుండి 200 రోజులకు పెంచి కొలతలతో నిమిత్తం లేకుండా రోజుకి పెరిగిన పనిదినాలకు అనుగుణంగా 600 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నబోయిన రాములు, తోట రాములు, ఆవుల ఉప్పలయ్య, సార్కే  రామయ్య, కొమిరే సుశీల, చెన్నబోయిన రాము, కొమిరే వెంకన్న, చెన్నబోయిన వీరభద్రం,కె ఉప్పలమ్మ, దుస్స లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.