రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి

రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి

కేసముద్రం/ గూడూరు, ముద్ర: వ్యవసాయానికి మూడు గంటలు విద్యుత్ ఇస్తే సరిపోతుందని రైతుల పట్ల అవహేళనగా మాట్లాడిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు మండల కేంద్రాల్లో బారాస శ్రేణులు బుధవారం నిరసన వ్యక్తం చేసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

గూడూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటినుంచి కాంగ్రెస్ కు రైతులంటే గిట్టదని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి, రైతుబంధు, రైతు బీమా  కార్యక్రమాలతో వస్తున్న ఆదరణను తట్టుకోలేక రైతులపై రేవంత్ రెడ్డి అక్కసు వెళ్ళగక్కారని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు ఓలం చంద్రమోహన్, సుజాత, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఖాసీం, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు, నీలం దుర్గేష్, వెంకటకృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి, అనిల్ గౌడ్, భీముడు నాయక్, నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.