సేవా తత్పరతకు చిహ్నాలు నర్సులు...

సేవా తత్పరతకు చిహ్నాలు నర్సులు...

రాష్ట్రగిరిజనసంక్షేమ, మహిళా,శిశుసంక్షేశాఖ మంత్రి సత్యవతిరాథోడ్.. 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: శాంతి ప్రేమకు చిహ్నాలుగా నర్సుల సేవలు చిరస్థాయిగా గుర్తిండిపోతాయని రాష్ట్రగిరిజనసంక్షేమ, మహిళా,శిశుసంక్షేశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.మహబూబాబాద్ లో శుక్రవారం  గిరిజన భవన్ లో నైటింగేల్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంను నర్సింగ్ కళాశాల సిబ్బంది ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి మంత్రి సత్యవతిరాథోడ్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి  సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... డాక్టర్ లు వైద్యం అందిస్తే నర్సులు వైద్యంతో పాటు సేవలు కూడా అందించడం గొప్ప విషయమని, సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా పరిగణింప బడుతున్నదన్నారు.గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2 నర్సింగ్ కళాశాలలు మాత్రమే ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 33 నర్సింగ్ కళాశాలలు మంజూరు చేసుకోగా, అవసరాలను బట్టి 19 కళాశాల లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. బోధన తరగతులు ప్రారంభిం చుకున్నామన్నారు. గతంలో 300 సీట్లు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ లో ఇప్పించడం జరిగిందన్నారు. అలాంటి పరిస్థితుల నుండి మనరాష్ట్రం లొనే కళాశాల స్థాపించగా ఇతర దేశాలనుండి నర్సింగ్ కు విద్యార్థులు చేరే పరిస్థితికి ఎదిగామన్నారు.

హాస్పిటల్స్ లో ఆధునిక వైద్య సౌకర్యాలు పెంచడం జరిగిందని ప్రసవాలు ఎక్కువగా జరిపిస్తున్నా మన్నారు. నర్సింగ్ కోర్స్ విద్యాద్ధులకు రూ. 1800లు స్టైఫెండ్ ఉండేదని, రూ. 5000లకు పెంచామన్నారు. వైద్యులకు కూడా  మంచి గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతున్నదన్నారు. నర్సింగ్ కళాశాలకు తన శాఖ నుండి 12 లక్షలకు టాయిలెట్స్ కు ఇచ్చానన్నారు. విద్యార్థులు కోరిన విధంగా రోడ్ వెయిస్తామన్నారు.
విద్యార్థులు వృత్తిలో పరిపూర్ణత పొందాలని మొదటి బ్యాచ్ మంచి బ్యాచ్ గా పేరు తెచుకోవాలన్నారు. తదనంతరం వచ్చే విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ... తొలిసారిగా 1974 నుండి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు. జిల్లాలోని కళాశాలలో 58 మంది నర్సింగ్ విద్య అభ్యసిస్తున్న వారందరూ ఉత్తమ విద్యార్థులు గా నిలవాలని, ఉద్యోగాల ఇతర దేశాలకు వెళ్లనక్కర లేదని , రాష్ట్రంలోనే మంచి ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకోవాలన్నారు.మార్గ దర్శకులుగా నిలవాలన్నారు. అనంతరం మంత్రి సత్యవతిరాథోడ్ విద్యార్థులతో కలిసి కొవ్వొతులను వెలిగించి  , కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంలీల, వైస్ ప్రిన్సిపాల్ జోస్న, ఆర్సీఓ రాజ్యలక్ష్మి, నర్సింగ్ కళాశాల అడ్మిన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.