తల్లి మొదటి గురువు

తల్లి మొదటి గురువు

మాతృ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్
కేసముద్రం, ముద్ర: తల్లి మొదటి గురువని, తల్లిని మించిన దైవం లేదని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనుముత్యం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలదని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాతృ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మహిళలకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. తల్లి స్ఫూర్తితో గంజి శ్రీనివాస్ రెడ్డి సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే అభినందించారు.

శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తితో తల్లిదండ్రులను గుర్తుంచుకునే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు కిషన్, గ్రామ సర్పంచ్ దార్ల రామ్మూర్తి, అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గంజి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ రావు, మార్కెట్ చైర్పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్, సొసైటీ చైర్మన్ దీకొండ వెంకన్న, ఎంపీటీసీ పింగిలి రజిత తదితరులు పాల్గొన్నారు.