ఇనుగుర్తిలో బారాస ఆత్మీయ సమ్మేళనం

ఇనుగుర్తిలో బారాస ఆత్మీయ సమ్మేళనం

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో పూర్వపు కేసముద్రం మండల స్థాయి భారాస ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 17న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు మహబూబాబాద్ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఇనుగుర్తి మండల కేంద్రంలో బారాస రాష్ట్ర నాయకుడు వద్దిరాజు కిషన్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇనుగుర్తిలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం ప్రతిష్టాత్మకంగా నిలిచేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు ఇనుగుర్తి మండలం ప్రకటించిన నేపథ్యంలో నూతన ఇనుగుర్తి మండల పరిధిలోని గ్రామాలకు చెందిన క్యాడర్ పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.

నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషిచేసి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సుమారు 5000 మంది ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా భోజనాలు, సమావేశ స్థలి సభ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు దీకొండ వెంకన్న, గుండా వెంకన్న, తొర్రూరు మార్కెట్ వైస్ చైర్మన్ విజయ్, మండల బారాస ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్, ఇనుగుర్తి, కోమటిపల్లి, అయ్యగారి పల్లి సర్పంచులు దార్ల రామ్మూర్తి, నీలం యాకయ్య, మామిడి శోభన్ తదితరులు పాల్గొన్నారు.