మున్సిపాలిటీ స్థలాలను పరిరక్షించాలి...

మున్సిపాలిటీ స్థలాలను పరిరక్షించాలి...

 మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మున్సిపాలిటీ స్థలాలను గుర్తించి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. మహబూబాబాద్ లో సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ స్థలాల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ శశాంక సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ... జిల్లా ఏర్పడిన నాటి నుండి జిల్లా అభివృద్ధి లో భాగంగా పట్టణ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించవలసిన భాద్యత అధికారులపై ఉందన్నారు. మున్సిపాలిటీ ని సుందరంగా తీర్చిదిద్దడానికి చేపట్ట వలసిన పనులపై దృష్టి పెట్టాలన్నారు. ముందుగా మున్సిపల్ స్థలాలను గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తూ సర్వే నెంబర్లతో సహా మ్యాప్ లను రూపొందించాలన్నారు.కొండపల్లి గోపాలరావు నగర్ లోని బరియల్ గ్రౌండ్ కు ప్రహరీ ఏర్పాటు చేయాలన్నారు.

అంగడి, జంతుపరిరక్షణ కేంద్రం,గోశాల ఒకే చోట ఏర్పాటు చేయాలన్నారు. దాశరథి పార్క్ పనులను స్మృతి వనం గా చేపట్టి మున్సిపాలిటీ అభివృద్ధి పరచాలన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్,  ఓసిక్లబ్ లీజ్ వివరాలపై సమీక్షిస్తూ కోర్టు కేసులుంటే పరిష్కరించుకోవాలన్నారు. నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలాన్ని పిల్లల పార్క్ గా తీర్చిదిద్దాలన్నారు. మున్సిపాలిటీ ముఖద్వారాలను సుస్వాగతం ఆర్చిలతో అందంగా తీర్చిదిద్దాలని, అనంతారం దారిలో హరిత హారం, సాలార్ తండా  గుడి వద్ద డిఎస్పీ, ట్రాఫిక్ పోలీస్ కార్యాలయాల స్థలాలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కొమరయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, తహసీల్దార్ ఇమ్మనియెల్, కలెక్టర్ కార్యాలయం సెక్షన్ అధికారి పున్నంచందర్, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.