రైతుల పాలిట రాబందు పార్టీ కాంగ్రెస్ - జిల్లా గ్రంథాలయం చైర్మన్ నవీన్ రావు గారు 

రైతుల పాలిట రాబందు పార్టీ కాంగ్రెస్ - జిల్లా గ్రంథాలయం చైర్మన్ నవీన్ రావు గారు 

మరిపెడ. ముద్ర: సమైక్య రాష్ట్రంలో కూనరిల్లిన వ్యవసాయ రంగం తో తెలంగాణ రైతాంగం పట్టణాలకు వలస బాట పట్టిందని జిల్లా గ్రంథాలయం చైర్మన్ నవీన్ రావు అన్నారు. బీ అఆర్ ఎస్ ప్రభుత్వము రైతాంగ సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఉచిత 24గంటల విద్యుత్ పై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై  గురువారం విద్యుత్ సబ్ స్టేషన్ ల ముందు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమైక్య కుట్ర దారుని శిష్యుడైన రేవంత్ రెడ్డిని మతి గతి తప్పింన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని తన పరువును మరింత దిగజర్చు కుందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యం లో తెలంగాణ లో శర వేగంగా జరుగుతున్న ప్రగతిని ఓర్వలేని కాంగ్రెస్ దేశం దాటి విమర్శలు చేయటం సిగ్గు చేటు అన్నారు. కాంగ్రెస్ పాలన లో విద్యుత్ సంక్షోభం, పవర్ హాలి డే లతో వ్యాపార వాణిజ్య రంగాలు ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపారు. మండు వేసవిలో నిరంతరం విద్యుత్ కోతలు లేకుండా సరఫర చేసిన ఘనత దేశంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.  ఓటు కు నోటు దొంగ మా కొద్దు అంటూ పార్ట్ శ్రేణులు నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్  సింధూర కుమారి వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి కౌన్సిలర్స్ పానుగోతు సుజాత వెంకన్న, ఎడెల్లి పరుశురాములు, మచ్చర్ల స్రవంతి భద్రయ్య, కౌసల్య గణేష్, లలిత వెంకటేశ్వర్లు, బయ్య బిక్షం,పద్మ కోటేష్, శ్రీను, కిషన్ నాయక్, ఊరుగొండ శ్రీనివాస్,కో ఆప్షన్ సభ్యులు మక్సూద్ హుషేన్,బాలాజీ నాయక్ దిగజర్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు