కాట్ర పల్లిలో బొడ్రాయి వేడుకలు

కాట్ర పల్లిలో బొడ్రాయి వేడుకలు

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకల కోలాహలం నెలకొంది. ఈనెల మూడున బుధవారం ఉదయం 9-27 గంటలకు కాకతీయుల కాలం నాటి శివకోటేశ్వరాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర కలశ, నవగ్రహ, సుబ్రహ్మణ్యేశ్వర, విఘ్నేశ్వర, నాగదేవత, ఆంజనేయస్వామి, బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం గ్రామస్తులు సామూహికంగా ఉపనిషత్, వేద పారాయణం, గణపతి పూజ, వరునాయనం, పంచామృత నవనీతాధివాసములు, మూల మంత్ర పూజలు హోమాలు నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టాపన కోసం ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా స్వగ్రామానికి చేరుకోవడంతో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది