ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా 5కే రన్

ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా 5కే రన్
  • ప్రారంభించిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..

ముద్రప్రతినిధి, మహబూబాబాద్:-రాబోయే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు అవగాహన ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో భాగంగా స్వీప్ 5కే రన్ ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలో ఆర్టీసి బస్టాండ్ వద్ద జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓటు శాతం కంటే ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో నమోదు కావాలని కోరారు.18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కువినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. దేశ భ‌విష్యత్తును నిర్దేశించేది ఓటు హ‌క్కు అని దానిని ప్రజ‌లు గుర్తించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. క‌ళాశాల‌ల‌తో పాటు విద్యా సంస్థల్లో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించ‌డం జ‌రుగుతోంద‌ని.. అదే విధంగా వివిధ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోనూ వినూత్న ఓట‌రు జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త‌ప్పనిస‌రిగా ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఈ సందర్భంగా జిల్లా సాంస్కృతిక కళాకారుల బృందం ఓటు హక్కు వినియోగంపై పాటలు పాడి అవగాహన కల్పించారు. ఈ స్వీప్ 5కే రన్ బస్టాండ్ వద్ద ప్రారంభమై అండర్ బ్రిడ్జ్ , జిల్లా ఆసుపత్రి, నెహ్రూసెంటర్ ద్వారా ఎంఆర్ఓ కార్యాలయం వరకు చేరుకొని ముగిసింది. ఈ 5కె రన్ లో విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఎండేవిడ్,డిఎఫ్ఓ బత్తిని విశాల్, ట్రైనీ ఐపిఎస్ పండరి చైతన్, అదనపు ఎస్పీ చెన్నయ్య, ఆర్డీఓ అలివేలు, స్వీప్ నోడల్ అధికారి జీనుగు మరియన్న, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళావతిబాయి, మునిసిపల్ కమీషనర్ రవీందర్, డిఈఓ రామారావు, పశు సంవర్ధక శాఖ అధికారి సుధాకర్, గ్రౌండ్ వాటర్ అధికారి సురేష్ ,ఎంఆర్ఓ భగవాన్ రెడ్డి, ఎన్ వైకె కో-ఆర్డినేటర్ అవినాష్, జిల్లా అధికారులు,వైద్య అధికారులు, డిఆర్డీఏ సిబ్బంది, పోలీసు సిబ్బంది, విద్యార్థులు,యువకులు, ప్రజలు పాల్గొన్నారు.