అడ్డొచ్చిన తండ్రిని బెదిరించి కొడును చంపేశారు!

అడ్డొచ్చిన తండ్రిని బెదిరించి కొడును చంపేశారు!

ముద్ర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇరవయ్యేళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హతుని ఒవైసీ మార్కెట్ కు చేరువలోలని అసబ్ బాబానగర్ లో నివసిస్తున్న ఖలీల్ (20)గా గుర్తించారు. ఈ యువకుడిని ప్రత్యర్థులు కత్తులతో వేటాడి మరీ చంపారు. దీనిని అడ్డుకోబోయిన ఆ యువకుడి తండ్రిని కూడా బెదిరించారు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న బహదూర్ పురా పోలీసులు రక్తపు మడుగులో పడివున్న ఖలీల్ ను ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ హత్యకు కారణాలేమిటన్నది ఇంకా తెలియరాలేదు.