బ్రేకింగ్ న్యూస్ - టీటీడీ పదవి నుంచి రమణ దీక్షితులు తొలగింపు...

బ్రేకింగ్ న్యూస్ - టీటీడీ పదవి నుంచి రమణ దీక్షితులు తొలగింపు...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు టీటీడీ షాకిచ్చింది. ఆయన్ను ఆ పదవి నుండి తొలగిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.

ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీటీడీ అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బోర్డులో చర్చించామని..రమణ దీక్షితులును తొలగించాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు భూమన తెలిపారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ దీక్షితులును తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన సంగతి తెలిసిందే.