దశాబ్ది వేడుకల్లో రైతులను భాగస్వామ్యం చేయాలి

దశాబ్ది వేడుకల్లో రైతులను భాగస్వామ్యం చేయాలి

కేసముద్రం, ముద్ర: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ మూడవ తేదీన రైతు వేదికల వద్ద నిర్వహించే వేడుకల్లో రైతులను భాగస్వామ్యం చేయాలని ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల విజయవంతం కోసం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

రైతులకు రైతుబంధు, రైతు బీమా ఇస్తున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లోని ఆరు రైతు వేదికల్లో, ప్రతి వేదిక వద్ద వెయ్యి మంది రైతులతో ఆవిర్భావ వేడుక సభలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు  తెలియజేయాలని కోరారు.  

ప్రతి గ్రామంలో ప్రజా ప్రతినిధులు, రైతులు , రైతుబంధు కోఆర్డినేటర్లు, సభ్యులు, మహిళలు, వివిధ శాఖల అధికారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి, కేసముద్రం, ఇనుగుర్తి తాసిల్దార్లు పులి సాంబశివుడు, మహమ్మద్ దిలావర్ ఆబిద్ అలీ, ఎంపీడీవో రవీందర్ రావు, మండల వ్యవసాయ అధికారి, బి.వెంకన్న, ఏపిఎం రాజీరు, ఆయా క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు, వివిధ గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.