ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

కేసముద్రం, ముద్ర: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని, మక్కలను కొర్రీలు పెట్టకుండా ప్రకటించిన మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్ డిమాండ్ చేశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లోని ధాన్యం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.

ఈ సందర్భంగా చొప్పరి శేఖర్, మంద భాస్కర్ మాట్లాడుతూ అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని మద్దతు ధరలకే కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వయంగా సీఎం కేసీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇవ్వడంతో పాటు, స్వయంగా మిల్లర్లతో సమావేశం నిర్వహించి తడిసిన ధాన్యంతో పాటు మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆరోపించారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవడానికి నానా కొర్రీలు పెడుతూ జాప్యం చేస్తుండడంతో రైతులు రోజుల తరబడి మిల్లుల వద్ద పడి గాపులు పడుతున్నారని ఆరోపించారు. ఒకవైపు ప్రకృతి ప్రకోపం చూపిస్తూ చేతికొచ్చిన పంటను నేలపాలు చేస్తే, మరోవైపు పండించిన కొద్ది పంటను అమ్ముకోవడానికి వెళ్తే సకాలంలో కొనుగోలు చేయకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సకాలంలో కాంటాలు కాక, మరోవైపు కాంటాలు పూర్తయిన ధాన్యం బస్తాలను ఎగుమతి, దిగుమతి చేసేందుకు లారీలు దొరకక రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రైతుల గోస అర్థం చేసుకొని సకాలంలో కాంటాలు అయ్యే విధంగా, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.