ఎన్నికల ఏడాది.. అంతా కష్టపడదాం

ఎన్నికల ఏడాది.. అంతా కష్టపడదాం
  • విభేదాలు వీడి పార్టీ గెలుపునకు ఏకమవ్వాలి
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్
  • సదా మీ సేవలోనే : ఎమ్మెల్యే రెడ్యానాయక్
  • ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం: ఎంపీ కవిత
  • బీజేపీ, కాంగ్రెస్ లవి చిల్లర రాజకీయాలు: పురాణం సతీష్
  • మరిపెడ ఆత్మీయ సమ్మేళనానికి వేలాదిగా కార్యకర్తలు

ముద్ర మరిపెడ, మార్చి 02:  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు కార్యకర్తలే పునాదులు, వారి కృషి, వారి ఉద్యమ పోరాటలు.. కేసీఆర్ మొక్కవోని దీక్ష వెరసి తెలంగాణ సిద్దించింది. మన పాలన మన చెంతకు చేరింది. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశానికే అన్నం పెట్టె స్థాయికి ఎదిగింది. దీనికంతటికి కార్యకర్తల కృషి, పట్టుదలే కారణం అందుకే బీఆర్ ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగం అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మరిపెడ మండల కేంద్రంలోని లక్ష్మారెడ్డి గార్డెన్స్ లో స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ అధ్యక్షతన జరిగిన మరిపెడమండల స్థాయి ఆత్మీయ సమ్మెళనానికి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మానుకోట జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ బిందు, బీఆర్ ఎస్ రాష్ట నాయకులు రామసహాయం రంగరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావులతో కలిసి ముఖ్య అతిథితులుగా హాజరైయ్యారు. తొలుత మానుకోట జిల్లా ఆత్మీయ సమ్మెళనాల ఇన్చార్జ్ పురాణం సతీష్ కేసీఆర్ కార్యకర్తలకు పంపిన ఆత్మీయ సందేశాన్ని చదివి వినిపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ రెడ్యానాయక్ అంటే కార్యకర్తలు, కార్యకర్తలు అంటే రెడ్యానాయక్.. అలా ఉన్నాను కాబట్టే ఆరు సార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొందానన్నారు. కార్యకర్తల ఎనలేని కృషి, క్రమశిక్షణ వల్లే రెడ్యానాయక్కు ఇన్నేళ్లు ప్రజా సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. తన పని తనాన్ని మెచ్చి జనరల్ స్థానమైన, రిజర్వేషన్ స్ధానమైన ప్రజలు గెలిపిస్తున్నారని, మారుమూల తండాలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తాను కార్యకర్తల నిరంత శ్రమ, ప్రజల దీవెనలతోనే ఆరుసార్లు గెలిచానన్నారు. అందుచేతనే ఎన్నేళ్లయినా తన ప్రజల కోసం నియోజవకర్గంలోనే ఉన్నానని, ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ.. ఏ సమయమైనా 24గంటల్లో ఏ సమయమైనా స్పందిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నానన్నారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో బీఆర్ ఎస్ పార్టీ లాంటి పార్టీని చూడలేదన్నారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లే అయినా నేడు దేశాన్ని సాదుతున్న రాష్టాల జాబితాలో నాలుగో స్థానంలో నిలవటం కేసీఆర్ పనితనానికి నిదర్శనం అన్నారు. ప్రజలకు సంక్షేమం, గ్రామాలకి అభివృద్ధి, నిరుద్యోగులకు ఐటీ కారిడార్, స్వయం ఉపాదిపొందే వారికి రుణాలు, పారిశ్రామిక కంపెనిల పెట్టుబడులు ఇలా తొమ్మిదేళ్లలో తెలంగాణను అబ్బుర పరిచే స్థాయికి, ప్రధానంగా రైతాంగాన్ని రాజును చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు. అందుకే మరోమారు బీఆర్ ఎస్ గెలిచేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమాలు వివరించాలని సూచించారు.


మా మధ్య వస్తే నలిగి పోతారు: మంత్రి సత్యవతి రాథోడ్.


మా మధ్య ఎలాంటి పంచాయతీ లేదు.. మా మధ్య ఎలాంటి వర్గాలు, విభేదాలు, పంచాయతీలు లేవని.. మేమంతా కలిసి పనిచేశుతున్నామని, మా మధ్యకు ఎవరైనా వస్తె నలిగిపోతారని, మంత్రి సత్యవతి రాథోడ్ విర్శకులకు ఘాటైన జవాబిచ్చారు. మరిపెడ ఆత్మీయ సమ్మెళనానికి ముఖ్యఅతిథిగాహజరైన ఆమె తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, గిరిజన మంత్రిగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉండడం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నన్నారు. 75 ఏళ్లుగా పాలించిన పాలకులు.. ఏనాడు 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదని, మంచినీటి సమస్య తీర్చలేదని, ఆడబిడ్డ పెళ్ళికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ.1లక్ష ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వాదే అన్నారు. అమావాస్యకు పౌర్ణమికి ఒకసారి వచ్చే నాయకులు వస్తారు పోతారు..కాబట్టి ప్రజలు గుర్తించి పార్టీ కోసం పనిచేయాలన్నారు. మారు మూల ఏజన్సీ గ్రామాలకు రోడ్లను ఇచ్చి ఆ ప్రాంత ప్రజల చైతన్యం కోరుకున్న పార్టీ మనదన్నారు. ఆడపిల్లల గురుకులాలు ఎక్కువ మన జిల్లాకు కేటాయించారన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ గెలుపుకోసం అంతా ఒక్కటిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.


పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం: ఎంపీ మాలోత్ కవిత

పార్టీకి కీలకమైన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారి ఆర్థికాభివృద్ధికి అన్ని విధాల అదిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మానుకోట జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత అన్నారు. ఒక పూట పస్తులు ఉండైనా కార్యకర్తలను రక్షించుకునే బాధ్యత తమపై ఉందన్నారు. ఆపద వస్తే తనకి ఒక్క కాల్ చేస్తే స్పందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మెన్ నూకల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా నాయకులు రామడుగు అచ్యుతరావు, కుడితి మహేందర్ రెడ్డి, గుగులోత్ వెంకన్న, ముత్యం వెంకన్న, డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మెన్ చాపల యాదగిరి రెడ్డి, మరిపెడ మండల పార్టీ అధ్యక్షుడు రామసహాయం సత్యనారాయణ రెడ్డి, మరిపెడ ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్, మునిసిపల్ చైర్ పర్సన్ గుగులోత్ సిందూర రవినాయక్, వైస్ ఎంపీపీ గాదె అశోక్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అద్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు తాళ్లపల్లి రఘు, పట్టణ అద్యక్షుడు ఉప్పల నాగేశ్వర రావు, మరిపెడ మండల పార్టీ ఉపాద్యక్షుడు నారెడ్డి సుదర్శన్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు కాలునాయక్, బీఆర్ ఎస్ నాయకలు గుగులోత్ రాంబాబు, తేజావత్ రవీందర్, ఎస్టీ సెల్ అద్యక్షులు అజ్మీర రెడ్డి, బాలాజీ, మైనార్టీ అద్యక్షుడు లతీఫ్, ప్రధానకార్యదర్శి యాకుబ్ పాషా, ఆరు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, డోర్నకల్ మునిసిపల్ చైర్మెన్, వైస్ చైర్మెన్, వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.