మారుమూల రోడ్డుకు మోక్షం!

మారుమూల రోడ్డుకు మోక్షం!

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని మారుమూల గిరిజన తండాలకు మెరుగైన రోడ్డు వసతి ఏర్పడనుంది. ఇనుగుర్తి మండలం మీట్యా తండా, పంతులు తండాకు రోడ్డు సౌకర్యం సరిగా లేక వర్షాకాలంలో ఆయా గిరిజన తండాల ప్రజలు రాకపోకలు సాగించడానికి నానా యాతన పడేవారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ చొరవతో గిరిజన సంక్షేమ శాఖ నుంచి 2.19 కోట్లతో ఐదు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇటీవల రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకుస్థాపన చేయగా బుధవారం గుత్తేదారు రోడ్డు పనులను ప్రారంభించారు. ఇనుగుర్తి- తొర్రూరు ఆర్ అండ్ బి రోడ్డు నుంచి మీట్యా తండా, పంతులు తండా మీదుగా నెల్లికుదురు - ఎర్రబెల్లి గూడెం ఆర్ అండ్ బి రోడ్డు వరకు ఐదు కిలోమీటర్ల మేర కొత్తగా బీటీ రోడ్డు వేయనున్నారు. బుధవారం రోడ్డు ఫార్మేషన్ పనులను లాంచనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మిట్యా తండా గ్రామ సర్పంచ్ బానోత్ నరేష్, తొర్రూరు మార్కెట్ డైరెక్టర్ గుగులోత్ రవి నాయక్,  బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రవి, పిఎసిఎస్ డైరెక్టర్ గుగులోత్ అనూష, ప్రభాకర్, శ్రీనివాస్, సెక్రటరీ లలిత తదితరులు పాల్గొన్నారు.