పోరాట వీరులకు స్ఫూర్తి  దొడ్డి కొమురయ్య..

పోరాట వీరులకు స్ఫూర్తి  దొడ్డి కొమురయ్య..

 మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక 

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంకు ఆజ్యం పోసిన వ్యక్తి దొడ్డి కొమరయ్య అని, భూమి, భుక్తికోసం.. వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి దొడ్డి కొమరయ్య అని జిల్లా కలెక్టర్ శశాంక కీర్తించారు. మహబూబాబాద్ లో సోమవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ..కార్యక్రమంలో  కలెక్టర్ శశాంక దొడ్డి కొమరయ్య చిత్రపటానికి  పూలమాల సమర్పించి నమస్కరించారు. 1927 ఏప్రిల్ 3న జన్మించిన  రైతాంగ వీరుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తొలి యోధుడు దొడ్డి కొమురయ్య అని,  భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి దొడ్డి కొమరయ్య అని జిల్లా కలెక్టర్ శశాంక కీర్తించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి గ్రామంలో యాదవ వంశంలో  దొడ్డి కొమురయ్య జన్మించారన్నారు.

ఒకప్పుడు నిజాం పాలనలో నల్గొండ జిల్లాలో భాగంగా ఉన్న కడివెండిలో  పేదలు, సామాన్యుల బతుకులు దారుణంగా ఉండేవని. భూమి, పంట, పశువులు, పారే నీళ్లపైనా ప్రజలకు  హక్కులు ఉండాలని దొడ్డి కొమురయ్య  గ్రామాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు.  బానిసత్వాన్ని నిర్మూలించేందుకు  గ్రామగ్రామానా  సమావేశాలు  పెట్టి ప్రజల్ని ఏకం చేశారన్నారు. ఈ సందర్భంగా జయంతిని జరుపుకోవడం అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, డేవిడ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నరసింహస్వామి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి, జిల్లా యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.