భూమి సునీల్ కు పితృవియోగం...

భూమి సునీల్ కు పితృవియోగం...

ముద్రప్రతినిధి, మహబూబాబాద్:భూమి సునీల్ గా జాతీయస్థాయిలో గుర్తింపుపొందిన మేక సునీల్ రెడ్డి తండ్రి మేక సంజీవరెడ్డి అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్ లో మరణించారు.

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన సంజీవరెడ్డికి ఇద్దరు కుమారులు సంతానం* కాగా పెద్దకుమారుడు సునీల్ రెడ్డి నల్సార్ న్యాయకళాశాలలో చదివి భూమి సునీల్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ధరణిలోని లోపాలను అద్యయనం చేసి, సవరణలు చేయడానికి ఇటీవల ఏర్పాటు చేసిన ధరణి కమిటీలోనూ సునీల్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించి సభ్యునిగా నియామకం చేసారు. సంజీవరెడ్డి హైదరాబాద్ లో తన రెండవ కుమారుడు సందీప్ రెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మరణించారు. మేక సంజీవరెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ నుండి కురవి మండలం అయ్యగారిపల్లి కి తీసుకవస్తున్నారు. మంగళవారం అయ్యగారిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.