ముఖ్యమంత్రి చిత్రపటానికి వీఆర్ఏల పాలాభిషేకం

ముఖ్యమంత్రి చిత్రపటానికి వీఆర్ఏల పాలాభిషేకం

ముఖ్యమంత్రి కెసిఆర్ కు రుణపడి ఉంటాం 

గూడూరు మే 19 (ముద్ర): వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తానని అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం నిన్న గురువారం మంత్రివర్గ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించడం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి వీఆర్ఏలు పాలాభిషేకం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని వీఆర్ఏలు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రికి జీవితాంతం వీఆర్ఏ కుటుంబాలు రుణపడి ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏల పట్ల సానుకూలంతో నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన విషయమని అన్నారు.  ఈ కార్యక్రమంలో  వి. ఆర్. ఏ ల జిల్లా కో -కన్వీనర్ దారావత్ జుంకిలాల్ మండల చైర్మన్ పడిగె శ్రీను, కో -చైర్మన్ దారావత్ రవి, అల్లాడి శ్రీను  బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు వెం. వెంకటకృష్ణరెడ్డి సీనియర్ నాయకులు నూకల సురేందర్, వాంకుడోత్ కటార్ సింగ్, ఎడ్ల రమేష్, ఎదునూరి వెంకన్న, సంపత్ రావు, వి.ఆర్. ఏ. లు శివరాత్రి నాగలక్ష్మి, నాగరాజు, రాములు, విష్ణు,రాము, నరేష్, స్వరూప, సుహాసిని, రమేష్, లక్ష్మయ్య, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.