గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు
  • మహిళలకు తీవ్ర గాయాలు
  • యాలాల  బీ సీ బాలికల  గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం యాలాల మండలం బీ సీ బాలికల  గురుకుల పాఠశాలలో సోమ వారం సాయంత్రం ప్రమాదవశాత్తు గ్యాస్  సిలిండర్ పేలడం తో  ముగ్గురు వంట పని వారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గాయపడిన ముగ్గురు మహిళలను తాండూరు జిల్లా ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అనిత ,  బస్సమ్మ, ఫర్హాన్ బేగం లు గాయపడ్డారు. వీరంతా తాండూరు పట్టనవాసులు.వంట చేసేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో ప్రమాదం జరిగిందని తెలిసింది. దారితీసిన పరిస్థితులను గురించి పోలీసులు విచారణ చేపట్టారు.