విద్యార్థినులతో అనుచిత ప్రవర్తన చేసిన నిందితుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఏబీవీపీశాఖ ఆధ్వర్యంలో ధర్నా....

విద్యార్థినులతో అనుచిత ప్రవర్తన చేసిన నిందితుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఏబీవీపీశాఖ ఆధ్వర్యంలో ధర్నా....

- ప్రభుత్యం మారిన విద్యార్థులపై ఆగని అరాచకాలు.
- వార్డెన్ పై వెంటనే సస్పెండ్ చేయాలి.
- నిందితులను కటినంగా శిక్షించాలి.
- ABVP నగర కార్యదర్శి మాడవేనీ సునీల్ డిమాండ్

ముద్ర, కోరుట్ల: కార్గిల్ చౌరస్తా వద్ద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాడవెని సునీల్ మాట్లాడుతూ భువనగిరిలో పదోవ తరగతి విద్యార్థుల మృతిపై అనేక అనుమానాలు వున్నాయని, విద్యార్థుల వసతి గృహాలోకి ఆటో డ్రైవర్లు ఎలా ప్రవేశిస్తారని, ఈ విషయమై పలుమార్లు పిర్యాదు చేసిన వార్డెన్ చర్యలు తీసుకోలేదని అన్నారు. వసతి గృహాల్లో భద్రత వైఫల్యం సరిగా లేదని దీనిపై ప్రభుత్యం ఎందుకు స్పందించడం లేదని, ప్రభుత్యం ఏర్పడి ఇన్ని రోజులు గడుస్తున్న విద్యా శాఖకు మంత్రి లేడని ఎద్దేవా చేసారు.

ప్రభుత్వనికి విద్యా వివస్తపై చిత్తశుద్ది లేని, రోడ్ మీద ఫుడ్ స్టాల్ తొలగిస్తే స్పందించిన ముఖ్యమంత్రి ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మరణిస్తే ఎందుకూ స్పందిస్తాలెరో చేప్పాలని, ఈ ఘటనను ABVP తీవ్రంగా ఖండిస్తుందని మరణించిన విద్యార్ధులకు కుటుంబానికి వెంటనే తగిన న్యాయం చేయాలని పట్టుబట్టారు. ప్రభుత్యం ఇకనైనా స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గత ప్రభుత్యం మంత్రులని,ఎమ్మెల్యేను ఎలాగైతే అడ్డుకున్నామో కాంగ్రెస్  ప్రభుత్యం విద్యార్ధులకు అన్యాయం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి నిందితులపై కటినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల వసతి గృహాల్లో గట్టి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి మాసం వినయ్ ,రాఘవేంద్ర, మని, గంగ సాగర్, విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.