ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లె నిద్ర- ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లె నిద్ర- ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించడం కోసమే పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే జగిత్యాల రూరల్ మండల లక్ష్మి పూర్ గ్రామంలో మీరు నేను కార్యక్రమంలో భాగంగా పల్లె నిద్ర చేసి ఆదివారం ఉదయాన్నే వార్డులలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ స్థానికమహిళలు, యువకులు,రైతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును పరిశీలిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ తో కలిసి ఎమ్మెల్యే తిమ్మా పూర్ రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి, రూ. 1.50 లక్షల తో హనుమాన్ ఆలయానికి శంకుస్థాపన చేసారు.