బండారి నరేందర్ సేవలు చిరస్మరణీయం - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

బండారి నరేందర్ సేవలు చిరస్మరణీయం - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : బండారి నరేందర్ సేవలు చిరస్మరణీయం జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమారు అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఎస్ వీఎల్ ఆర్ గార్డెన్స్ లో 33 వ వార్డు కౌన్సిలర్ బండారి రజనీ భర్త మాజీ కౌన్సిలర్, జగిత్యాల పట్టణ బి.ఆర్.ఎస్ పార్టీ రైతు విభాగ అధ్యక్షుడు బండారి నరేందర్ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి నరేందర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, డిఎంహెచ్ ఓ శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయి ,పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు మంచాల కృష్ణ, టీవీ సూర్యం,మహిల విభాగం అధ్యక్షురాలు కచ్చు లత, కౌన్సిలర్ లు, పట్టణ బి అర్ ఎస్ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.