భావితరాల విద్యార్థులకు మీరే ఆదర్శం కావాలి

భావితరాల విద్యార్థులకు మీరే ఆదర్శం కావాలి

అట్టహాసంగా సూర్య గ్లోబల్ స్కూల్లో సైనోర 2కే 23 వేడుకలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జీవితం చాలా చిన్నదని ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రతి విద్యార్థి నిరంతర కృషి చేయాలని సూర్య గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ బొయినిపెళ్లి  శ్రీధర్ రావు అన్నారు. బుధవారం సూర్య గ్లోబల్ స్కూల్లో సైనోర 2కే 23 వేడుకలను నిర్వహించగా విద్యార్థులందరు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలతో పాఠశాల వాతావరణం కోలాహలంగా మారగా పదోతరగతి విద్యార్ధులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శ్రీధర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో విద్యాబ్యాసన్ని కొనసాగించాలన్నారు.

ఉపాధ్యాయులు బోధించిన పాటాలను శ్రద్ధగా విని ఉత్తమ ర్యాంకులను సాధించి చదువు చెప్పిన గురువులకు, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని కోరారు. జీవితం చాలా చిన్నదని ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులు, గురువులు విద్యార్థుల నుంచి మంచి భవిష్యత్తును ఆశిస్తారని వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఉన్నత లక్ష్యాలను చేరుకొని మరికొందరి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్య స్కూల్ డైరెక్టర్లు హరిచరన్ రావు, మౌనికా రావు, రజితా రావు, సుమన్ రావు, జగన్ రావు తోపాటు విద్యార్థిని విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.