మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి సేవలు చిరస్మరనీయం

మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి సేవలు చిరస్మరనీయం

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా, ఎమ్మెల్యే గా కోమిరెడ్డి రాములు మెట్ పెల్లి ప్రాంతానికి, కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలు చీరస్మరనీయమని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి కొనియాడారు. మెట్ పెల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు  ఇటీవల కాలంలో మరణించగా కోమిరెడ్డి రాములు నివాసంలో అయన కుటుంబ సభ్యులను ఓదార్చి, కోమిరెడ్డి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం అయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. దశబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన సీనియర్ నేత కోమిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆమె వెంట మాజీ కౌన్సిలర్ లు తాటిపర్తి దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పుప్పాల అశోక్,  బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాపు రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, శ్రీదర్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు విజయ్ తదితరులున్నారు.