కారు స్టీరింగ్ ఎం.ఐ.ఎం చేతిలో..

కారు స్టీరింగ్ ఎం.ఐ.ఎం చేతిలో..

నిఘా సంస్థల పూర్తి వైఫల్యమే అసలు పోలీస్ యాక్ట్ అమల్లో ఉందా.!

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మున్సిపల్ మాజీ చైర్మన్ బోగ శ్రావణి ప్రవీణ్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో కారు స్ట్రిరింగ్ ఏమ్ఐఎమ్ చేతిలో ఉందని ప్రభుత్వంపై వొత్తిడితెస్తూ ప్రజల రక్షకులైన పోలీసులకే చట్టం పనికిరాని చుట్టమైందని ఓ వర్గానికి చెందిన వందలాది మంది వచ్చి ఆందోళనకు దిగితే నిఘా సంస్థలు నిద్రపోయాయా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు. జగిత్యాల ప్రెస్ క్లబ్లో డా.శ్రావణి మీడియాతో మాట్లాడుతూ బుధవారం రోజున ఒకపూట జగిత్యాల ప్రజాలు బయబ్రాంతులకు గురయ్యేలా ఒక వర్గం పట్టణ నదిమద్యన ఆందోళన చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తోపాటు 12 మంది హైకోర్టు న్యాయమూర్తులు బీరప్ప దర్శనానికి వచ్చారన్నారు. వీరందరికి అసౌకర్యం కలిగించేలా ప్రధానంగా ప్రాణాలను నిలిపే అంబులెన్స్ ను కూడా డైవర్ట్ చేసేలా ఆ వర్గం ఆందోళన చేసిందన్నారు. వాస్తవానికి గత రెండు రోజుల క్రితం బస్సులో జరిగిన సంఘటనలో ఒక మహిళ తనను టిజింగ్ చేస్తున్నారని చంటి పిల్లతో ఉన్న ఆ మహిళ తన భర్తను కోరితే వచ్చిన వ్యక్తి పోలీసు కావడంతో ఈసంఘటనకు మతం రంగు పులిమి ఆందోళనకు దిగరన్నారు. వందలాది మంది వచ్చి పోలీసు స్టేషన్ ముందే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారని శ్రావణి పేర్కొన్నారు.

ఇద్దరు మహిళల మధ్యన జరిగిన అంశంపై విచారణ చేయకుండా వాస్తవాలను వెలికితీయకుండా ఎం.ఐ.ఎం ఒత్తిడితో ఆ పోలీసు అధికారిపై చర్యలను చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాస్తోందని శ్రావణి ఆరోపించారు. ఎవరికైనా కష్టం వస్తే పోలీసు స్టేషన్ మెట్లెక్కుతారని అదే పోలీసు స్టేషన్ లోని ఓ పోలీసుకె భద్రత లేకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల ఉన్నాయా అని బోగ శ్రావణి ప్రశ్నించారు. ఇక ఈ సంఘటనకు మతం రంగు పులిమి పోలీసు అధికారిపై చర్యకు ఆందోళనకు దిగేందుకు నిజామాబాద్, బోధన్, ఆర్ముర్, కోరుట్ల వంటి ప్రాంతాల నుంచి వందలాదిగా ఒక వర్గం ప్రజలు జగిత్యాలకు వచ్చారని వీరి రాకపై నిఘా సంస్థలు ఎందుకు అరా తీయలేదని శ్రావణి ప్రశ్నించారు. రాష్ట్రంలో, జగిత్యాలలో నిఘా సంస్థలు కేవలం బిజెపి కార్యక్రమాలపై నిఘా పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. శాంతియుతంగా హనుమాన్ చాలీసా పటిస్తా మని అంటే పోలీసులు బిజెపి నాయకులను చేట్టుకో పుట్టకో పోలీసు స్టేషన్లలో నిర్బంధిస్తారని శ్రావణి చెప్పారు. ఇటివలే జిల్లా ఎస్పీ ప్రకటించారని జగిత్యాల జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉందని సభలు, సమావేశాలు, జనం గుమికూడడం నిషేధముందున్నారు.

బుధవారం రోజున ఓ వర్గానికి చెందిన వందలాది మంది వచ్చి ఆందోళన చేస్తే పోలీసు యాక్ట్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. అలాగే ఎంతమందిపై కేసులు పెట్టారని, గోరక్షక దళాలపై కేసులు పెట్టె పోలీసులు ఎందుకు నిన్న ఓకే చోట అంత మంది చేరిన ఆ వర్గం ప్రజలపై కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. బిజెపి పార్టీ అందరి సంక్షేమాన్ని కోరుతుందని ఎవరికి అన్యాయం జరిగినా ముందుంటామని అందులోనూ మహిళలకు అన్యాయం జరిగితే మొదటే ఉంటామని అన్నారు. ఇద్దరు మహిళల మధ్యన జరిగిన సంఘటనలో విచారణ జరపకుండా చర్యలు చేపట్టడాన్ని శ్రావణి తప్పుపట్టారు.ఒకవర్గానికి కొమ్ము కాసే చర్యలను మానుకోవాలని ప్రజలు అన్ని గమనిస్తున్నారని పాలకులకు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వినర్ చిలకమర్తి మదన్ మోహన్, వీరబత్తిని అనీల్, బిజేవై యం జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మరిపెళ్లి సత్యం, సారంగాపూర్ మండల ప్రెసిడెంట్ ఎండబెడ్ల వరుణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న, బిజేవైయం జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగు ఉమేష్, బిజేవైయం జిల్లా కోశాధికారి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.