విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా
Unlimited Medical Facility

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ జిల్లా కేంద్రంలోని కార్యాలయం ఎదుట తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జెంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ 2022 నుంచి ఇవ్వాల్సిన పిఆర్సి ఇవ్వాలని, 1999 నుంచి 2004 మధ్య నియామకమైన ఉద్యోగులకు పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ ఉద్యోగులందరికీ సింగిల్ మాస్టర్ పేస్కేల్ అమలు చేయాలని ఆర్టిజన్ కార్మికులకు పర్సనల్ పే నుంచి బేసిక్ పే లో విలీనం చేయాలని ఉద్యోగులందరికీ అన్లిమిటెడ్ మెడికల్ ఫెసిలిటీ కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో జి చేరాలు, ఎన్ రాంజీ, హరీష్, వరుణ్, అర్జున్, ఆంజనేయులు, రహీం, అశోక్, బాలు, సుమన్, సురేందర్, తిరుపతి, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.