బిఆర్ ఎస్ కార్యాలయనికి మున్సిపల్ సానిటేషన్ కార్మికులు

బిఆర్ ఎస్ కార్యాలయనికి మున్సిపల్ సానిటేషన్ కార్మికులు
బిఆర్ ఎస్ కార్యాలయనికి మున్సిపల్ సానిటేషన్ కార్మికులు
  • నెలకు రూ. 60  వేలు వెచ్చిస్తున్న మున్సిపల్ ?
  • ఓట్లు మావి ... పన్నులు మావి ..
  • విదులేక్కడ అంటున్న పట్టణ ప్రజలు 
  • మున్సిపల్ అధికారుల తిరుఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు


ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మునిసిపల్ అధికారుల తీరుఫై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు తాము చెల్లిస్తే సేవలు బిఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేద్రంలోని ధరూర్ క్యాంపులోని జిల్లా బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల మున్సిపల్ కార్యాలయం  నుంచి 3 నుంచి 4 నలుగురు వరకు  మున్సిపల్ సానిటేషన్ కార్మికులకు విధులు కేటాయించినట్లు తెలుస్తుంది. ఇందులో బాగంగా నిత్యం మున్సిపల్ కార్మికులు బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో  విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు  ఊడ్వడం, గార్డెన్లో కలుపు మొక్కలు తీయడం, చెట్లకు నీళ్లు పట్టడం తో పాటు కార్యాలయంలో పలు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగానే వారం రోజుల క్రితం 4 గురు మున్సిపల్ హరిత కూలీలతో పనులు చేపించిన ఘటన వెలుగు చూడగా ఇప్పుడు  మున్సిపల్  సానిటేషన్ విభాగానికి చెందిన 2 కార్మికులు స్విపింగ్, గార్డన్ లో కలుపు మొక్కల ఏరివేత లాంటి పనులు చేస్తున్నారు. అంటే ప్రతి రోజు బి ఆర్ ఎస్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు క్రమం తప్పకుండ విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ప్రతి నెల  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఇద్దరి నుంచి 4 గురు  కార్మికులను మున్సిపల్ అధికారులు కేటాయించినట్లు తెలుస్తుంది.

నలుగురి కార్మికుల వేతనాలు సుమారుగా రూ. 45 నుంచి 60 వేల వేతనాలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంఫై  పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నులు కట్టేది తాము మున్సిపల్ కార్మికులు విధులు నిర్వహించేది అధికార పార్టీ కార్యాలయంలోన అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోని వివిధ వార్డులలో చెత్త పేరుకు పోయిన, అటు అధికారులు, ఇటు కౌన్సిలర్లు స్పందించడం లేదని... కానీ ప్రైవేట్ కార్యాలయాలకు పరిశుద్ధ కార్మికులను ఎలా పంపుతారని ప్రశ్నిస్తున్నారు.

పట్టణంలోని  14 వార్డు అధికార బిఆర్ఎస్  పార్టికి చెందిన కౌన్సిలర్ కూతుర్ పద్మతో పాటు ఆ  కాలనీ వాసులు  తమ వార్డులో మునిసిపల్ సానిటేషన్ కార్మికులు మురికి కాలువలు తీయడం లేదని ప్రజావాణిలో కలెక్టర్ కు పిర్యాదు చేయడం, మున్సిపల్ కమిషనర్ కు ఎన్నిసార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని టిఆర్ నగర్ కు చెందిన కోటగిరి మోహన్ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయాడాన్ని బట్టి తెలుస్తుంది మున్సిపల్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరన్నది. జిల్లా కేద్రంలో ఉన్నతాధికారులు ఉన్న జగిత్యాల పట్టణ మున్సిపల్ లోని దుర్వినియోగం జరుగుతుంటే ఇంకా మిగత మున్సిపల్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి మరి. ఓట్లు మావి ... పన్నులు మావి కాని మున్సిపల్ కార్మికులు విధులు మా వీధుల్లో, కాలనీల్లో కాకుండా  ప్రైవేటు కార్యాలయాలలోన అంటూ పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.