గంగ పుత్రులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

గంగ పుత్రులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం -  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గంగ పుత్రులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.

జగిత్యాల పట్టణంలో రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసిఆర్ అని చెక్ డ్యాం లు,కాళేశ్వరం,మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చుక్కను ఒడిసి పట్టి తెలంగాణ ను పచ్చగా మార్చారన్నారు. జగిత్యాల నియోజకవర్గములో 63 కోట్ల తో 180 చెరువులు పూడిక తీసామని,

గతంలో ఒక్క నాయకుడు చెరువులను పట్టించు కోలేదు అని అన్నారు

నియోజకవర్గం లో 140 చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేయటం జరిగిందన్నారు.

గంగ పుత్రులకు జగిత్యాల పట్టణం లో 100 పైగా మోపెడ్ లను అందజేయటం జరిగింది.చింత కుంట చెరువు మినీ టాంక్ బాండ్ చేసి అధినీకరించమన్నారు.

 బీర్ పూర్ లో 140 కోట్ల తో రోళ్ళ వాగు ఆధునీకరణ,1 కోటి 40 లక్షలతో అరగుండాల ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల రైతులకు,గంగ పుత్రులకు ఉపయోగం అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్,జిల్లా మత్స్య శాక అధికారి దామోదర్, పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, కౌన్సిలర్ జంబర్టి రాజ్ కుమార్,

పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గుమ్ముల అంజయ్య , ఎప్ సి ఎ డైరెక్టర్ అరుమల్ల పవన్, ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి రజనీ కాంత్, రాజేష్ నవీన్, అశోక్ ,ఉపేందర్ ,రవి, శంకర్, జుంబార్తి శంకర్,నాచు పల్లి రెడ్డి,బింగి,రాజేశం,గుమ్ముల శంకర్,ఆరుముళ్లనారాయణ,కట్ల కుంట శంకర్, గంగారాం,జుంబర్తీ రమేష్,గంగారెడ్డి,కొలగని సత్యం,కౌన్సిలర్ కుసరి అనిల్ ,పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,ఉప అధ్యక్షుడు దుమల రాజ్ కుమార్,యూత్ అధ్యక్షులు గిరి,నాయకులు తదితరులు పాల్గొన్నారు.