రూ .2 కోట్ల తో మాడ్రన్ దోభి ఘాట్ లు: ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

రూ .2 కోట్ల తో మాడ్రన్ దోభి ఘాట్ లు: ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణ రజకులకు మాడ్రన్ దోభి ఘాట్ ల నిర్మాణం కోసం  రూ. 2 కోట్ల నిధులు  అయ్యాని స్థల సమస్యను వెంటనే పరిష్కరించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం  స్థలం సమస్య పై రజక కులసంఘంనాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిదులు తో మున్సిపల్ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  స్థల సమస్య పరిష్కరించి పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ఎమ్మెల్యే జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లి లో మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే జగిత్యాల రూరల్ మండల హబ్సిపూర్ గ్రామంలో జడ్పీ చైర్పర్సన్ దావవసంత సురేష్ తో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.  

హబ్సీపూర్  గ్రామంలో నుండి వైకుంఠ దామం వరకు రూ. 60 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం, రూ.19 లక్షల ఎఫ్ డిఆర్ నిధులతో వాటర్ ట్యాంక్ నుండి డి 53 కెనాల్ వెళ్ళే దారిలో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, గ్రామంలో రూ. 3 లక్షలతో నిర్మించిన ఎస్సీ సంఘ భవనాన్ని ప్రారంబించారు.  జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో గ్రామంలో నుండి పౌలేస్తేశ్వర  స్వామి ఆలయం వరకు రూ. 34 లక్షలతో రహదారి మరమ్మత్తులు మరియు కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ డాక్టర్ నరేష్, డిఈ రాజేశ్వర్, కౌన్సిలర్లు ఆవారి శివకేసరి బాబు, కప్పల శ్రీకాంత్, పంబాల రామ్ కుమార్, కూతురు రాజేష్ , జంబర్తి రాజ్ కుమార్, తాసిల్దార్ రాజేందర్, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, ఎఎంసి ఛైర్మెన్ నక్కల రాధ రవీందర్ రెడ్డి, సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్ల రెడ్డి, కౌన్సిలర్ ముస్కు నారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, ఎంపీటీసీ లక్ష్మి, ఉప సర్పంచ్ రమేష్, మోహన్ రెడ్డి, ఎంపిడిఓ రాజేశ్వరి రజక కుల సంఘ జిల్లా,మండల, పట్టణ అధ్యక్షులునారాయణ,పోచాలు, రాజు, కుల సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.