జగిత్యాల జిల్లాలో సంపూర్ణ బంద్ పాటించిన విద్యాసంస్థలు

జగిత్యాల జిల్లాలో సంపూర్ణ బంద్ పాటించిన విద్యాసంస్థలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బిసి సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘం పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రం లో అపరిష్కృత విద్యారంగ సమస్యల పరిష్కారం కై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల బంద్ కు పిలుపులో భాగంగా  జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలు జూనియర్ కళాశాలలు తరగతుల బహిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  విద్యా రంగంలో నెలకొని ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వం విద్యా రంగంపై అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి ఇప్పటికైనా వీడనాడి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సత్వరమే విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలని అన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలల గడుస్తున్నా విద్యార్థులకు ఇంతవరకు పాఠ్యపుస్తకాల పంపిణీ జరగలేదని, విద్యారంగంలో ఖాళీగా ఉన్న 44వేల అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలైన మూత్రశాలలు, త్రాగునీరు, మధ్యాహ్న భోజనం  వంటి సదుపాయాల కల్పన కు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, చింతల గంగాధర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు తిరుపురం రామచందర్ తదితరులు పాల్గొన్నారు.