సంక్షేమ పథకాల అమలు పరిశీలనకే మీరు నేను కార్యక్రమం- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

సంక్షేమ పథకాల అమలు పరిశీలనకే మీరు నేను కార్యక్రమం- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

సారంగాపూర్ ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పరిశీలనకు మీరు నేను కార్యక్రమం దోహదపడుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని రంగపేట గ్రామంలో శనివారం మీరు నేను కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్ర చేశారు. ఉదయం పూట వాడవాడకు తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్కడే పరిష్కరించారు. ముదిరాజ్ సంఘ భవన నిర్మాణం కోసం నాలుగు లక్షల 91000 చెక్కును కుల సంఘ సభ్యులకు అందజేశారు. గ్రామానికి చెందిన యువకులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కు ఆకర్షితులై  బి.ఆర్.ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిక్కం జమున, పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి రవీందర్ రావు పాక్స్ వైస్ చైర్మన్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.