జగిత్యాలలో కాంగ్రెస్ నిరాహార దీక్ష... పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

జగిత్యాలలో కాంగ్రెస్ నిరాహార దీక్ష...  పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పార్లమెంటు లో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి నిరసిస్తూ జగిత్యాల పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. రాహుల్ సభ్యత్వ రద్దును కాంగ్రెస్ పార్టీ చీకటి దేశంలో చీకటి రోజుగా భావిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, మున్సిపల్ మాజీ అధ్యక్షులు గిరి నాగభూషణం, తాటిపర్థి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, జువ్వాడి కృష్ణరావు, బండ శంకర్, గాజుల రాజేందర్, కళ్లేపల్లి దుర్గయ్య, మన్సూర్, ఆల్లాల సరిత రమేష్ రావు తదితరలు పాల్గొన్నారు.