మల్యాలలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు

మల్యాలలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు

ముద్ర, మల్యాల:మాజీ బీజేపీ చీఫ్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బండి సంజయ్ పేరుపై ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మల్యాలలో కేక్ కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు నేరెళ్ల శ్రవణ్, ప్రధాన కార్యదర్శి గాజుల మల్లేశం,  కరభూజ చక్రం, బoడారి రాజు, సొన్నాకుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.