కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరి ధాన్యం 2500 గోనుగోలు చేస్తాం 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరి ధాన్యం 2500 గోనుగోలు చేస్తాం 
  • రైతుల ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడిని అరికట్టాలి
  • ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :  వరి ధాన్యం ధర్మకాంట తూకం రసీదుకు అనుగుణంగా రైతులకు డబ్బు చెల్లింపులు జరపాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవనులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్లలో  రైతులకు జరుగుతున్న అన్యాయాలఫై సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ కు లేఖ రాసినట్లు  తెలిపారు.  రైతులకు ధర్మకాంట తూకం వేసి రసీదు ఇవ్వడం లేదని, ట్రక్ సీట్ పత్రం మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ధర్మకాంట, ట్రక్ షీట్ పత్రాల తూకాల్లో వ్యత్యాసాలను పరిశీలించినట్లయితే రైతులు ఏ మేరకు దగాకు గురవుతున్నారో తెలుస్తుందని అన్నారు. ఇంకా కల్లాలలోనే  60 నుంచి 70% వరి ధాన్యం ఉందని, తూకం అన్లోడింగ్  జాప్యంతో రైతులు ఒత్తిడి గురవుతున్నారని అన్నారు . అన్ లోడింగ్ జాప్యం లేకుండా 8 గంటల లోపే అన్ లోడు అయితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ధర్మకాంట రసీదు ఆధారంగా  పేమెంట్ పరిగణంలోకి తీసుకోవాలన్నారు. సంచికి రెండు కిలోలు చొప్పున క్వింటాలుకు 5 కేజీలు అదనంగా తూకం వేస్తూ మిల్లర్లు రైతులను దోపిడి చేయడం దురదృష్టకరమన్నారు.  

రైతాంగం, రైతు కూలీలు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళ లాంటి వారని, రైతు భీమా లాగే రైతు కూలీలకు, అసంఘటిత కార్మికులకు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే తాము అధికారులకు వచ్చాక వరి ధాన్యాన్ని క్వింటాలుకు రూ. 2500 చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ధర్మ కంట తూకం రసీదు ఇప్పించి దానికి అనుగుణంగా డబ్బులు చెల్లించాలని ఎమ్మెల్సీ కోరారు. మిల్లర్లు ఎవరి బదువులు అయిన అక్రమాలకు పాల్పడితే జిల్లా అధికారులు సిజ్ చేయాలనీ, అవసరమైతే జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతుల కోసం ధర్నా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినా భూషణం ,మాజీ ఎంపీపీ ధర రమేష్ బాబు, బండ శంకర్, గాజేంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు.