ప్రయాణిస్తున్న కారులో మంటలు

ప్రయాణిస్తున్న కారులో మంటలు

బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న యజమాని..

మెట్‌పల్లి ముద్ర:- నడి రోడ్డుపై   ప్రయాణిస్తున్న కారులో మంటలు వ్యాపించడంతో కారు యజమాని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామానికి చెందిన సుర బక్కయ్య చల్ గల్ నుండి పనుల నిమిత్తం కోరుట్ల పట్టణానికి తన ఇండికా విష్ట కారులో ప్రయాణిస్తుండగా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారుకు చేరుకోగానే ఒక్కసారికి కారు లోపల నుండి మంటలు రావడంతో గమనించిన బక్కయ్య కారులో నుండి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.మంటలలో కారు పూర్తిగా దగ్దం కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అధిక ఉష్ణోగ్రత ప్రభావము వల్ల కారు లోపల మంటలు వ్యాపించి ఉండవచ్చని పలువురు అంటున్నారు.