కమిషనర్ బల్ల కింద నుండి లంచం తీసుకుంటుండు

కమిషనర్ బల్ల కింద నుండి లంచం తీసుకుంటుండు
  • ఓ పాస్టర్ ఆరోపణ...
  • యూ ట్యూబ్ లో వైరల్ అవుతున్న వీడియో...
  • తాత్కాలిక ఉద్యోగి తొలగింపు..
  • ఆఫీస్ విషయాలు లీక్ చేస్తున్నందుకే..
  • నేను ఎవరిని లంచం అడగలేదు కమిషనర్

మెట్‌పల్లి ముద్ర:- మున్సిపల్ కమిషనర్ బల్ల కింద నుండి లంచాలు తీసుకుంటున్నాడని. ఇలా లంచాలు తీసుకునే వారి నోట్లో మన్ను పడుతుందని. ఓ చర్చ్ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. ఆ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. ఆఫీస్ విషయాలు లీక్ చేస్తూ ఆ పాస్టర్ యూ ట్యూబ్ వీడియో చేయడానికి మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ తాత్కాలిక ఉద్యోగి కారణం అని ఆ ఉద్యోగిని విధుల్లో నుండి తొలగించినట్లు సమాచారం.. వివరాల్లోకి వెళితే పట్టణంలోని దుబ్బవాడలో నివాసం ఉంటున్న ఓ పాస్టర్ అదే వార్డులో సెట్ బ్యాక్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఆ పాస్టర్ నిర్మించిన భవనం నిబంధనలకు విరుద్ధంగా ఉందని చుట్టుపక్కల వాళ్లు మున్సిపల్ కార్యాలయంలో పిర్యాదు చేయగా టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు పాస్టర్ కు నోటీస్ లు జారీచేయడంతో మున్సిపల్ లో పని చేసే తాత్కాలిక ఉద్యోగి పాస్టర్ కు నోటీసులు అందజేస్తాడు. నోటీస్ లు తీసుకొని మున్సిపల్ అధికారులను కలసిన పాస్టర్  తన ఇంటి నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందని తనకు లంచం ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేశాడని. తన అసిస్టెంట్ ను ఇంటికి పంపితే పర్మిషన్ కు 2 లక్షల 40 వేల రూపాయలను కట్టి పర్మిషన్ తీసుకున్నానని. మీకెందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నిస్తే నోటీస్ లు తీసుకువచ్చిన తాత్కాలిక ఉద్యోగి తన కాళ్ళు మొక్కి వెళ్ళాడని సదరు పాస్టర్ ఆరోపిస్తూ వీడియో చేసి యూ ట్యూబ్ లో పెట్టాడు. ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో విషయం ఆనోటా ఈనోటా మున్సిపల్ కమిషనర్ కు చేరగా చాటుగా విచారణ జరిపిన కమిషనర్ తన కార్యాలయంలో పని చేసే మరో తాత్కాలిక ఉద్యోగి ఇంటి నిర్మాణం నిలచిపోకుండా ఉండేందుకు. టౌన్ ప్లానింగ్ అధికారి, కమిషనర్ లు లంచాలు తీసుకుంటారని అందుకోసమే నోటీస్ లు జారీ చేస్తారని. అధికారులతో తాను మాట్లాడతానని పాస్టర్ కు చెప్పడంతోనే ఆ పాస్టర్ తమ పై ఆరోపణలు చేసినట్లు తేలడంతో ఆ ఉద్యోగిని గుట్టు చప్పుడు కాకుండా విధుల్లో నుండి తొలగించినట్లు సమాచారం.కాగా ఆ ఉద్యోగి మున్సిపల్ కార్యాలయంలో జరిగే ప్రతి  విషయాన్ని బయటకు చేరవేస్తున్నాడని. పలువురి దగ్గర డబ్బులు తీసుకున్నట్లు పిర్యాదు లు రావడంతో కమిషనర్ పలు మార్లు మందలించినట్లు సమాచారం.ఇదిలా ఉంటే పిర్యాదులు వచ్చిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాడా లేదా లంచాలు తీసుకుంటున్నాడు అని  వచ్చిన ఆరోపణలు నిజమని కమిషనర్ ఋజువు చేసుకుంటాడో వేచి చూడాల్సిందేనని పలువురు అంటున్నారు. 

  • నేను ఎవరిని లంచం అడగలేదు..
  • మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్.

నేను ఎవరిని లంచం అడగలేదు. పాస్టర్ ఇంటి నిర్మాణం చేస్తున్నాడని. ఆ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందని నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని.నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాన్ని నిలిపి వేసి నిబంధనల ప్రకారం నిర్మించేల చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు పిర్యాదు చేశారు. దీంతో నోటీస్ లు జారీ చేసి విచారించి నిబంధనల ప్రకారం నిర్మాణం చేయాలని సూచించాను తప్ప ఎవరిని లంచం అడగలేదు.