ఘనంగా సర్వాయి పాపన్న జయంతి

ఘనంగా సర్వాయి పాపన్న జయంతి

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి, బొమ్మనపల్లి, చిన్న ముల్కనూరు గ్రామాలలో సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుందరగిరి గ్రామంలో గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి ఉత్సవాలలో మండల గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి గౌడ్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సర్దార్ సర్వాయి పాపన్న మొఘల్ పాలకుల అరాచకాలను ఎదిరించి బహుజన రాజ్యాన్ని స్థాపించాడని.. నేటి తరానికి ఆయన ఆదర్శమన్నాడు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మాజీ అధ్యక్షులు కక్కెర్ల ఆంజనేయులు, కక్కెర్ల వెంకటేశం, నాయకులు తాళ్లపల్లి చంద్రయ్య, తాళ్లపల్లి వెంకన్న, ఉపాధ్యక్షులు కక్కర్ల లక్ష్మీనారాయణ,డైరెక్టర్లు కక్కర్ల సంజీవ్, బొమ్మగాని రాజు, కక్కర్ల ఆంజనేయులు, తాళ్లపల్లి రవీందర్, కక్కర్ల రవీందర్, బుర్ర పరశురాములు, కక్కర్ల రాజు, రాములు, అవినాష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.