కరోనా కష్ట కాలంలో సైతం సంక్షేమ పథకాల అమలు - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

కరోనా కష్ట కాలంలో సైతం సంక్షేమ పథకాల అమలు - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కరోనా కష్ట కాలంలో సైతం సంక్షేమ పథకాల అమలు చేసి ప్రతి రేషన్ కార్డ్ కి రూ. 1500, ఉచిత బియ్యం అందజేసిన మహా వ్యక్తి కేసిఆర్ అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ రెడ్డి , నాతర్ల శ్రీనివాస్,నక్క శ్రీనివాస్, 30 మంది  యూత్ కాంగ్రెస్ నాయకులు  ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బి అర్ ఎస్ పార్టీ లో చేరగా పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశానికీ ఆదర్శమని తెలంగాణ రాష్ట్ర పథకాలను దేశం అనుసరిస్తుందని అన్నారు.

రైతు బందు, రైతు బీమా గొప్ప కార్యక్రమాలని, కుల వృత్తులు అభివృద్ది కి ముఖ్యమంత్రి  కృషి చేస్తున్నారని, ఐటి రంగంలో కేటీఆర్  కృషి తో హైదరాబాద్ లో 13 లక్షల మంది యువత ఐటి రంగం లో ఉద్యోగాలు సాధించారని అన్నారు. నిరంతరం ప్రజల సేవ కోసమే ఉన్నామని, కొత్త పాత తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా  కృషి చేసి పార్టీ అధికారం లోకి వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు బందు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, ఆత్మ ఛైర్మెన్ రాజీ రెడ్డి,  సత్తి రెడ్డి, చంద్ర రెడ్డి, పూరిపాటి రాజీ రెడ్డి, గర్వందులగంగన్న, రాజేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.