'బలగం' చూసేందుకు తరలొచ్చిన జనం..

'బలగం' చూసేందుకు తరలొచ్చిన జనం..

చిగురుమామిడి ముద్ర న్యూస్: పల్లె వాతావరణానికి దగ్గరగా.. బంధుత్వాలకు విలువనిస్తూ.. అనుబంధాలను కలుపుతూ రూపొందిన చిత్రం బలగం. అలాంటి సినిమాను మండలంలోని సుందరగిరిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఆవరణలో సోమవారం రాత్రి భారీ స్క్రీన్ పై ప్రదర్శంచారు. ఎంపీటీసి మెడబోయిన తిరుపతి, గ్రామ నివాసి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ రామోజు రజితకృష్ణమాచారి తమ సొంత ఖర్చులతో స్క్రీన్ ఏర్పాటు చేసి బలగం సినిమా చూపించారు. ఈ సినిమా చూడడానికి ఊరు ఊరంతా తరలివచ్చారు. సినిమాను వీక్షించారు. వృద్ధులు, మహిళలు క్లైమాక్స్ సన్నివేశాన్ని చూసి కంట తడి పెట్టుకున్నారు. తమతమ అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. మంచి సినిమాను ఉచితంగా చూపించిన ఎంపీటీసిని, మార్కెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ ను గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముగ్గురు మహిళలకు రామోజు రజిత కృష్ణమాచారి చీరలు బహూకరించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, సింగిల్ విండో చైర్మన్ జంగా రమణారెడ్డి, ఆలయ చైర్మన్ తాళ్ళపల్లి సంపత్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ తాళ్ళపల్లి తిరుపతి, ఉప సర్పంచ్ జంగా శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు కంది తిరుపతిరెడ్డి, తాళ్లపల్లి చంద్రయ్య, వంతడుపుల దిలీప్ కుమార్, శ్రీరామోజు రాజ్ కుమార్, గందె సంతోష్, గందే సంపత్, కాశబోయిన నర్సయ్య, ఆకుల మల్లికార్జున్, నాంపెల్లి కొమురయ్య, ఎనగందుల లక్ష్మణ్, కొమ్ము కొమరయ్య, గందె రమేష్, కంది శంకర్, పెసరి రాధాకృష్ణ, బండ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు