తెలంగాణ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

తెలంగాణ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

BJYM నాయకులు, ఆకుల మనోహర్ పటేల్ 

గంగాధర ముద్ర :  కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ లో ఈరోజు బీజేవైఎం నాయకులు ఆకుల మనోహర్ మాట్లాడుతూ TSPSC ప్రశ్నపత్రాలు లీకేజీ మరువకుండానే 10వ  తరగతి పేపర్ లీక్ అయింది, ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఈ కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలకు శాపంగా మారింది. పేపర్ లీకేజీ విషయం తెలిసిన కానీ పరీక్షలను కొనసాగిస్తున్నారు నిజంగా సిగ్గుచేటైన విషయం ఈ ప్రభుత్వానికి , కేవలం ప్రైవేటు యాజమాన్లకు ఈ ప్రభుత్వం తొత్తులుగా మారి విద్యార్థుల జీవితాలతో చలగాటలాడుతూ   ఇంత  నీచెప్పు పనులకు గల కారణం ఈ ప్రభుత్వాన్ని చెప్పవచ్చు, పేపర్ లీకేజ్ కి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

మరియు ఇంత దారుణమైన పరిస్థితిలో జరుగుతున్నాయి కాబట్టి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వ దిక్కుమాలిన ఆలోచనల వల్ల విద్యార్థుల జీవితాలకు శాపంగా మారుతున్నాయి, కావున ఇకనుండి అయినా విద్యార్థుల జీవితాల కోసం కొంచెం ఆలోచించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సక్రమంగా పరీక్షలు నిర్వహించాలి, ఈ పరీక్ష పేపర్ లీకేజీ కి గల అధికారులు ఎవరైతే ఉన్నారో  వారిని వదిలిపెట్టవద్దు.ఇలాంటి సంఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా అని విద్యార్థుల పక్షాన డిమాండ్ చేశారు.