పిట్ట ముట్టలేదని పేకముక్కలు పెట్టారు

పిట్ట ముట్టలేదని పేకముక్కలు పెట్టారు

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో పిట్ట ముట్టడం లేదని పిండి పదార్థాలతో పాటు పేకముక్కలను పెట్టారు.సోమవారము రోజున ఆబాది జమ్మికుంట గ్రామంలో వృధ్యప్యంతో వెంకట్రాజం అనే వ్యక్తి మృతి చెందాడు. 3వ రోజు కార్యక్రమంలో పిట్ట ముటకపోవడంతో బంధువులు, కులస్తులు, గ్రామస్తులు చింతిచారు. గ్రామస్తుల సలహామేరకు జరగబోయే కార్యక్రమంలో పేకముక్కలు పెట్టాలని నిర్ణయించారు 5వ రోజు కార్యక్రమంలో తనకు ఇష్టమైన పదార్థాలు,వస్తువులు, పెకముక్కలు, మద్యం పెట్టడంతో పిట్ట వచ్చి పదార్థాలను ముట్టింది ఈ సంధర్బంగా బంధువులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.