ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 23 నుంచి 29వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, ఏప్రిల్ 24 నుంచి మే 18వరకు సివిల్స్ ఇంటర్వ్యూలు ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ 3 నుంచి 9వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. నిన్న యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ తాజా నిర్ణయం తీసుకుంది. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి గ్రూప్ 1 పరీక్ష రాసే 25మంది అభ్యర్థులు హాజరు కావాల్సిఉంది. వారిని దృష్టిలో ఉంచుకొని అధికారులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు.