ఆత్మహత్య చేసుకుంటున్నాం

ఆత్మహత్య చేసుకుంటున్నాం

 ఆత్మహత్య చేసుకుంటామని ఓ దంపతులు సెల్ఫీవీడియో తీసి బంధువులకు పంపారు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. స్థానిక తిరుమల నగర్‌లో ఉంటున్న  స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి చిత్రాడ వరప్రసాద్‌(47), మీరా(41) దంపతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. దీంతో వారి కుమారుడు కృష్ణ సాయితేజ  దువ్వాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాల్వ వద్ద చెప్పులు, హ్యాండ్ బ్యాగు, మొబైల్ గుర్తించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.