ప్రేయసికోసం స్నేహితుడి హత్య..

ప్రేయసికోసం స్నేహితుడి హత్య..

ముద్ర, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రేయసికోసం స్నేహితుడిని హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో  తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసుల కథనం ప్రకారం.. హరికృష్ణ, నవీన్ ఓ యువతి  దిల్ సుఖ్ నగర్ లోని ఐడియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో నవీన్ చనువుగా ఉంటున్నాడని కోపం పెంచుకున్న హరికృష్ణ నవీన్ ను పిలిపించి ఈ నెల 17న అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని రమాదేవి పబ్లిక్ స్కూల్ సమీపంలో హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోలీసులు పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నవీన్ కనిపించడం లేదంటూ ఈ నెల 22న నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.