Gagan Pahad Blast: గగన్ పహాడ్ వద్ద స్క్రాప్ దుకాణం లో పేలుడు: 10 మందికి గాయాలు

Gagan Pahad Blast: గగన్ పహాడ్ వద్ద స్క్రాప్ దుకాణం లో పేలుడు: 10 మందికి గాయాలు
Gagan Pahad Blast in scrap yard

ముద్ర, రంగారెడ్డి ప్రతి నిధి: హైదరాబాద్ శివారులోని గగన్ పహాడ్ లో ఓ స్క్రాప్ దుకాణం లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 10 మంది గాయపడ్డారు.  ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పారు. స్క్రాప్ దుకాణం లో చిక్కుకున్న వారిని ఇతర సిబ్బంది రక్షించారు. 

గాయపడిన వారిలో అందరూ యువకులే. రాయల్, అస్లమ్, సద్దాం, అఫ్తాబ్, కమల్, సాహిల్, ప్రతాప్ సింగ్, మామా లను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్క్రాప్ దుకాణం  SS Enterprises యజమాని మహ్మద్ బాబుద్దీన్ పై కేసు నమోదు చేశారు.